కిష్టారెడ్డిపేటలో హైడ్రా కూల్చివేతలు…
భారీ మూడు భవనాలు నేల మట్టం చేశారు
ఇందూర్ వార్త సంగారెడ్డి జిల్లా బ్యూరో గోపాల కృష్ణ
అమీన్పూర్ మున్సిపాలిటీ లోని కిష్టా రెడ్డి పేటలో లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. కొద్దిరోజులగా కూల్చివేత లకు దూరంగా ఉన్న హైడ్రా ఆదివారం మళ్లీ అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియను మొదలు పెట్టారు.
దీంతో చెరువులు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేసినవారి గుండెల్లో దడ మొదలైంది. ఈరోజు ఉదయo భూమిని ఆక్రమించి చేపట్టిన అక్రమణ నిర్మాణా లను కూల్చివేస్తున్నారు.
నివాసం ఉన్న భవనాలను మినహాయించి మూడు భారీ అంతస్తులను హైడ్రా కూల్చివేసింది. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు అక్కడ మోహరించారు అయితే, దీనిలో ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఏడు ఎకరాలు ఆక్రమణకు గురైంది.
బఫర్ జోన్లోని నాలుగు ఎకరాల్లో 25 కు పైగా పక్కా భవనాలు, అపార్టు మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్ లోని మూడు ఎకరాల్లో 25 డూప్లెక్స్ లని హైడ్రా కూల్చివేసింది.
అయితే, ప్రజలు నివాసం ఉండే నిర్మాణాలపై త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది. ప్రభుత్వ నిర్ణయం వెలువడిన తరువాత చెరువు స్థలాన్ని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అపార్ట్ మెంట్లు, ఇళ్లపై హైడ్రా కొరడా ఝుళిపించే అవకాశం ఉంది.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లా పరిధిలోని అక్రమ నిర్మాణాలపైనా హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జిల్లా పరిధిలోని అమీన్ పూర్ మున్సిపాలిటీ కిష్టారెడ్డి పేట్ పరిధిలోని సర్వే నెం. లో అక్రమ నిర్మాణాలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు.
రెండు రోజుల క్రితం రాష్ట్ర కేబినెట్ భేటీ సమావేశంలో హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నా రు. హైడ్రాకు చట్టబద్దతతో సర్వ ఆధికారాలు కల్పించా లని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.
ఓఆర్ఆర్ లోపల ఉన్న చెరువులు, కుంటలు, నాలాలతో పాటు వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిర క్షణ అధికారాలన్నీ హైడ్రాకే అప్పగిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. దీంతో హైడ్రా మరింత దుకుడుగా ముందుకెళుతుంది.