కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యం..
కార్మికుల ప్రాణాలకు రక్షణ ఏది..?
ఇందూర్ వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20
రక్షణ చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం
గాలిలో కలుస్తున్న కార్మికుల ప్రాణాలు
ఓసి -2 ప్రమాదాలకు భాద్యత ఎవరిది..
విషాదంలోనూ సింగరేణి డే వేడుకల..?
సామాజిక కార్యకర్త లాయర్ కర్నె రవి
మణుగూరు : సింగరేణి యాజ
మాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని, ఉత్పత్తి పై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణ పై లేదని,సామాజిక కార్యకర్త కర్నె రవి అధికారుల తీరుపై మండి
పడ్డారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓసి -2
లో జరిగిన ప్రమాదంలో ఆపరేటర్ మృతి ఘటన ఫై సమగ్ర విచారణ చేపట్టి ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని
డిమాండ్ చేశారు. గని ప్రమాదాల
తో కార్మికులు భయాందోళనకు గురవుతున్నారనన్నారు. బొగ్గు ఉత్పత్తితో పాటు రక్షణ పై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రమాదాలకు సంబంధించి బాధ్యులపై క్రిమినల్ చర్య తీసుకొని, వారిని సస్పెండ్ చేయాలన్నారు.ప్రమాదం జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కార్మికుల పై ఒత్తిడి చేస్తూ పని చేయుంచడం సరైంది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సింరేణి అధికారులు ఎమ్మెల్యేలను ప్రస
న్నం చేసుకోవాడానికే పని చేస్తు
న్నట్లు కనబడుతుందని, కార్మికుల సంక్షేమం పట్ల గాని రక్షణ యాజ
మాన్యానికి పట్టింపు లేదన్నారు. కార్మికులను కాపాడటంలో భద్రత ప్రమాణాలు పాటించడం లేదన్నా
రు. కార్మికుల పనిస్థలాల్లో కార్మి
కులకు ఎలాంటి ప్రమాదాలు జరగ
కుండా సరైన రక్షణ చేపట్టాలని యాజమాన్యానికి సూచించారు.
ఓసి -2 ప్రమాదానికి సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యమే కారణ
మని, కార్మిక అవగాహన లేని సూపర్వైజర్లు, కాలం చెల్లిన యం
త్రాలు, వాహనాలు, సరైన రక్షణ చర్యలు లేక పోవడంతోనే ప్రమా
దం జరిగిందని ఆయన ఆరోపించా
రు.రక్షణకు సంబంధించి రోడ్ల విష
యంలో, దుమ్మును అరికట్టడం
లో, ఫైర్ కోల్ నిరోధించడంలో గాని, మిషనరీ పూర్తిస్థాయిలో మర
మ్మతులు చేసి అందించడంలో గాని కార్మికులకు కావలసిన సేప్టీ పరికరాలను అందించడంలో ఏరియాలో అధికారులు ఎప్పుడూ నిర్లక్ష్యం వహించి,కార్మికులను ఇబ్బంది పెట్టడానికి పనిచేస్తున్నా
రని విమర్శించారు. కార్మికుల సమస్యలను పట్టించుకోవాల్సిన
కార్మిక సంఘాల నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం క పనిచేస్తున్నారని, మాది జాతీయ సంఘం కాదు, మాది జాతీయ సంఘం అంటూ గొప్పలు చెప్పు కుంటున్న నాయకులు యాజమా
న్యానికి, అధికారులకు తోత్తులు
గా వ్యవహరిస్తున్నారని, ఆయన దుయ్యబట్టారు. ఓ వైపు కార్మిక మరణంతో విషాదం నెలకొనగా జిఎం ఇతర అధికారులు ముగ్గు
ల పోటీలతో తరిస్తున్నారని, కార్మి
కులకు పై వారికున్న చిత్తశుద్ధిని ఈ ఘటన తెలియజేస్తుందన్నారు. ఇక ముందు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తగు చర్యలు చేపట్టాలని కోరారు.