కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ రాజకీయ శిక్షణ తరగతులకు ఎంపికైన ప్రకాష్ నాయక్
ఇందూర్ వార్త, కామారెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆదివాసీ రాజకీయ శిక్షణ తరగతులు నాగార్జునసాగర్ లో టిపిసిసి ఆదివాసీ చైర్మన్ డాక్టర్ భేల్లయ్య నాయక్ అధ్వారంలో రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన కాంగ్రెస్ పార్టీ సోదరులను ఎమ్మెల్యే మదన్మోహన్ నాయకత్వంలో లింగంపేట్ మండలం మాలోత్ తండ గ్రామపంచాయతీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ ప్రకాష్ నాయక్ ఎంపిక చేసారు . ఈ తరగతులు ఈ తరగతులు
నాగార్జున సాగర్ లో ఈ నెల 05-01-2025 నుండి 11-01-2025 వరకు జరగనున్న వరం రోజుల గిరిజన సాధికారిత , రాజకీయ శిక్షణ తరగతులకు దేశవ్యాప్తంగా 250 మందిని కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకులను డెలిగేట్స్ గా ఎంపిక చేయడం జరిగింది. ఈ శిక్షణ తరగతులకు దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు వచ్చి శిక్షణ క్లాసులు ఇవ్వడం జరుగును.