ఇందూర్ వార్త
బాన్సువాడ రూరల్
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పేదింటి ఆడబిడ్డల వివాహానికి లక్ష 116 వేల రూపాయలు అందిస్తు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు మేన మామగా మారారని మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ అన్నారు. శనివారం బాన్స్ వాడ మున్సిపల్ కార్యాలయంలో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి తో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఆర్ఐ అశోక్, నాయకులు ఏజాస్, కౌన్సిలర్లు బాడీ శ్రీనివాస్, నార్ల నందకిషోర్ గుప్తా, మోతిలాల్, నాయకులు వహాబ్, అమిర్ ఛావుస్, హకీమ్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.