కలెక్టర్ మానవత్వం
పల్లీలు అమ్ముకునే దివ్యాంగురాలికి రూ.లక్ష రుణం
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 20
ఖమ్మం త్రీ టౌన్ జహీర్ పుర చౌరస్తాలో దివ్యాంగురాలు డుంగ్రోత్ కమల నాలుగు చక్రాల బండిపై పల్లీలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఖమ్మం నగరంలో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పర్యటిస్తున్న సందర్భంలో దివ్యాంగురాలు కమలమ్మ పల్లీ బండి వద్ద కారులో ఆగారు. కలెక్టర్ అంటే ఎవ్వరో తెలియని కమల పల్లీలు కావాలా సార్ అని ఆడగటంతో… ఓ చిరునవ్వు నవ్వారు. దివ్యాంగురాలు కమల కుటుంబ పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. నేను మా అమ్మ మాత్రమే ఉన్నాం సార్ అంటూ తన దుర్భర జీవితాన్ని వివరించింది. స్పందించిన కలెక్టర్.. నీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటా ఇచ్చి వెళ్లారు. తర్వాత కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్యకు ఫోన్ చేసిన కలెక్టర్, జమలమ్మకు రుణం అందించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. దీంతో మెప్మా డీఎంసీ సుజాత, టీఎంసీ సుజాత, సీవో రోజా ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న బ్యాంక్ తో మాట్లాడి కేవలం ఐదురోజుల్లోనే రూ.1లక్ష వ్యాపార రుణం చెక్కును గురువారం అందించారు. త్వరలో కమలతో కూరగాయాల వ్యాపారం ఏర్పాటు చేసేందుకు కార్యచరణ చేశారు.