కరీంనగర్-జగిత్యాల రోడ్ విస్తరణకు మళ్లీ ఊపిరి: కేంద్రానికి బండి సంజయ్ వినతి
▪︎ గడ్కరీతో సమావేశమైన బండి సంజయ్
▪︎ ₹113 కోట్ల సీఆర్ఐఎఫ్ ప్రతిపాదనలు సమర్పణ
▪︎ నివేదిక అనంతరం పనులు ప్రారంభమవుతాయని హామీ
జూలై 28 ఇందూర్ వార్త ప్రతినిధి
కరీంనగర్-జగిత్యాల రహదారి విస్తరణ పనులు తక్షణం ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఈ రోజు కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు.ఈ రహదారి 4 లేన్‌గా విస్తరించేందుకు ఇప్పటికే ₹2151 కోట్ల ప్రతిపాదనలు సిద్ధమై, ఆమోదం పొందినప్పటికీ టెండర్ ప్రక్రియ ఆలస్యం అవుతున్నట్లు గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన గడ్కరీ సంబంధిత అధికారులను పిలిపించి వివరాలు కోరారు. ప్రజల అభ్యంతరాలు, న్యాయపరమైన ఇబ్బందుల వల్లే పనులు నెమ్మదించాయని చెప్పారు. అయితే ప్రస్తుతం అవన్నీ పరిష్కారమయ్యాయని, కమిటీ నివేదిక వచ్చిన వెంటనే టెండర్ ప్రక్రియ పూర్తిచేసి పనులు ప్రారంభిస్తామన్నారు..ఈ సందర్భంగా బండి సంజయ్ తెలంగాణలోని పలు రహదారి ప్రాజెక్టుల కోసం సీఆర్ఐఎఫ్ ద్వారా ₹113 కోట్ల విలువైన ప్రతిపాదనలు కూడా సమర్పించారు. వాటిలో ముఖ్యమైనవి…బావుపేట–ఖాజీపూర్ మధ్య మానేరు నదిపై హై లెవల్ బ్రిడ్జ్,గుండ్లపల్లి–పోతూర్ రహదారి విస్తరణ,చందుర్తి–మోత్కురావుపేట మధ్య వంతెన,కిస్టంపల్లి మార్గంలో వంతెన నిర్మాణం,అర్కాండ్ల–కన్నాపూర్ మధ్య వరద కాలువపై హై లెవల్ బ్రిడ్జ్ ఈ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు గడ్కరీ తెలిపారు. త్వరలోనే సీఆర్ఐఎఫ్ నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.