కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈపూర్ వినోద్ కుమార్ బీజేపీపైహాట్ కామెంట్స్
ఇందూర్ వార్త డెస్క్ జులై 10
రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ ఏరియాలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం తీసుకున్న భూములకు కేంద్ర ప్రభుత్వానికి సహించాల్సిన 33 కోట్లను కంటోన్మెంట్కు వచ్చేలా చేసిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంత్రి ప్రభాకర్ కి శాసనసభ్యులు గణేష్ కి కృతజ్ఞతలు తెలిపిన : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూర్ వినోద్ కుమార్
కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఈపూరు వినోద్ కుమార్, బీజేపీ పార్టీ పై చేసిన కామెంట్స్.
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఒక అడుగు ముందే ఉంటుందని అంటున్నావు కదా ?
మరి సెంట్రల్ నుంచి రావలసిన సర్వీస్ ఛార్జీల గురించి ఎందుకు మీరు మాట్లాడలేదు ?.
కాంగ్రెస్ పార్టీ, మరియు కంటోన్మెంట్ ప్రాంత వాసులందరూ కంటోన్మెంట్ ప్రాంతాన్ని, జిహెచ్ఎంసి లో విలీనం చేయాలని అంటే, మీరు దానికి వ్యతిరేకంగా కంటోన్మెంటు విలీనం వద్దని, బీజేపీ పార్టీ అగ్ర నేతలకు లేఖలు రాస్తారు ఇదెక్కడి న్యాయం.
కంటోన్మెంట్ ప్రాంతం పరిపాలన
మీ బీజేపీ పార్టీల నాయకుల చేతుల్లో ఉండాలని మీ స్వార్థం కాదా అని నేను అడుగుతున్నా.
ఇన్ని సంవత్సరాలు మీరు బోర్డు నామినేటెడ్ మెంబర్ గా ఉండి కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని ఎందుకు మీరు అడగలేదు. ఇది మీ స్వార్థం కాదా అని నేను అడుగుతున్నా.
కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలని, రాష్ట్ర ప్రభుత్వం 303 కోట్ల రూపాయల నిధులను బోర్డుకు రావడానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే గణేష్ చొరవ ఉంది అని అంటున్నాము. అది మీ అందరికీ తెలిసిన విషయమే.
బీజేపీ నాయకులకు ఒకటే సవాలు విసిరుతున్న,
మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నుండి సర్వీస్ ఛార్జీలు తీసుకొచ్చి మీ చిత్తశుద్ధినీ నిరూపించుకోండి.
ప్రజల ముందుకు వచ్చే మాట్లాడితే మేము మిమ్మల్ని గౌరవిస్తాము.
లేకపోతే మిమ్మల్ని అడుగున అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నాము.




