*ఓట్లు మావి… సీట్లు మీవా..? నిలదీస్తున్న ముదిరాజ్ బిడ్డలు*
కామారెడ్డి జిల్లా/ కామారెడ్డి. ( ఇందువార్త ) ఆగస్టు 24
ఓట్లు మావి… సీట్లు మీవా..?అని
నిలదీసే ముదిరాజ్ బిడ్డలు లేరా.ఈ రాష్ట్రంలో.?
అధికార పార్టీలోని జాతి నాయకులు పేలని తుపాకులా..?
ముదిరాజ్ ముద్దు బిడ్డలమని.. పౌరుషంలో రాజు బిడ్డలమని.. *ఆత్మగౌరవంతో బతికే పులి బిడ్డలమని.* చెప్పుకునే వారు ఇలాంటి వివక్షత పై మౌనం ఎందుకో ..?
మన ముదిరాజ్ లపై ప్రేమ నటిస్తూ పొలిటికల్ లీడరులుగా పిలిసే పేర్లు..
మీసం వెలివేసి రోషంతో మాట్లాడే మన ముదిరాజ్ బిడ్డలు అధికార పార్టీలో *పేలని తుపాకులయ్యారా*?
రాజ్యాధికారం కోసం పోరాటం చేయాలని ఊపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పాలకులకు ముదిరాజ్ ముద్దు బిడ్డలు ‘‘ *ఎస్* *బాంచెన్* ..’’ అంటూ బానిసలుగా మారారంటున్నది నిజమేనా. అందుకే అధికార పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ముదిరాజ్ బిడ్డలకు ఒక్క టిక్కెటు ఇవ్వకుండా మొండి చెయ్యి చూపింది..
ముదిరాజ్ లకు మినహా ఇతర కులాలకు ఇచ్చిన సీట్లుతో పోల్చిన బిసిలకు అన్యాయమే జరగుతుంది..
ముదిరాజ్ లు *కాగితపు పులులే* అనే భావనతో ఓట్ల కోసం,ఉపయోగించుకోవడానికి అధికార పార్టీ వ్యూహంలో ప్రజా ప్రతినిధులుగా వెలుగుతున్న వారు నోరు మెదుపడం లేదు.
ఐదు శాతం లేని అగ్రవర్ణాలకు మెజార్టీ సీట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ముదిరాజ్ లకు ఒక్క సీట్ కూడా ఇవ్వక పోయినా ముదిరాజ్ ల పేరుతో పదవులు పొందిన ఈ ఇద్దరి నోరు మూగపోవడానికి ఆ పదవులపై ఆశనే.
ముదిరాజ్ ల ఐక్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపించడంతో.. అధికార పార్టీ ముదిరాజ్ లను ఓట్ల బ్యాంక్ లుగా భావిస్తోంది. పదవుల కంటే ముదిరాజ్ ల ఆత్మస్థైర్యం ముఖ్యం అనే ధైర్యం చేసే నాథుడు లేకుండా పోయారు. అధికార పార్టీలో ఉన్న వారు కూడా సీఎం కేసీఆర్ తమ ముదిరాజ్ లకు సీట్లు ఇవ్వకపోయిన అన్యాయం చేస్తున్నారని నిలదీసే దమ్ము వారికి లేక పోవడానికి ఉన్న పదవులు ఊడుతాయ నే భయం వారిలో ఉందినే విమర్శ రాష్ట్రమంతటా వినిపిస్తుంది .నిజమే కదా .?
*ముదిరాజ్ యువత ముందుకు రావాలి*
— ఎంపీటీసీ సీటు నుంచి ఎంపీ సీటు దాకా, మన జాతిని తాకట్టు పెట్టిన నాయకులే తప్ప. జాతిని జాగృతం చేసిన నాయకులు కనబడటం లేదు…?
— మన రాష్ట్రంలో ఉన్న ఒక్క ముదిరాజ్ జాతికి ఎన్ని సంఘాలు ఎంత మంది రాష్ట్ర అధ్యక్షులు.
— ఇన్ని సంఘాలు ఉండి సాధించింది ఏమిటి .??
— కాసాని జ్ఞానేశ్వర్, ముదిరాజ్ సంఘం (24/1954).
— జగన్మోహన్, తెలంగాణ ముదిరాజ్ సంఘం(1181/2007)
— బండప్రకాష్ ముదిరాజ్, తెలంగాణా ముదిరాజ్ మహాసభ (443/2014)
— బోళ్ళ గణేష్, ముదిరాజ్ యువసేన (1545/2019)
— దారం యువరాజ్, తెలంగాణా యువజన సమాఖ్య (259/2020)
— లోకబోయిన రమణ, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం( టి ఆర్ ఏమ్ ఎస్) (233/2020)
— అల్లాదుర్గం సురేష్, ముదిరాజ్ సంక్షేమ సమితి (134/2021)
— మెపా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఇంకా అనేక సంఘాలు.. కోకొల్లలు నినాదాలు..
మన ముదిరాజ్ సంఘాలు అన్ని ఇప్పటికైనా ఒక్క తాటపైకి వచ్చి ఐక్యత చాటకపోతే మన మనుగడే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది….
ఆలోచించండి …
— ఎన్ని రోజులు బిసి-డి నుంచి బిసి- ఏ లోకి అంటూ గగ్గోలు పెడుదాం…….
ఎన్ని సార్లు ముదిరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేయుమని అడుకుందాం…
ఎన్ని యేండ్లు బ్రతిమలాడుదాం…
మన ఓటు హక్కు తోనే తేల్చుకుందాం
మొన్న ప్రజాక్షేత్రంలోనే మన సంఘలన్ని కలిసి తేల్చుకుందాం . రాజ్యాధికారంలో మన వాట ఎంత మన ఓట్లు ఎన్ని మన సీట్లు ఎన్ని …. ఇంక ఈ అక్కరకు రాని పార్టీల జెండాలు పట్టుకుని ఏం సాధించేది ఏమీ లేదు….
— ఇన్ని సంఘాలు విడి విడిగా ఉండి సాధించింది ఏమి . ?
— అన్ని సంఘాలు ఏకం కండి…. ముదిరాజ్ లకు ఏ పార్టీ ప్రాధాన్యత ఇస్తే ఆ పార్టీతో కలిసి వెళదాం…
కాంగ్రెస్ – బీజేపీ – టీడీపీ..
తెలంగాణ రాష్ట్రంలో మూడున్నర కోట్ల జనాభ ఉంటే 50 లక్షలకు పైగానే ముదిరాజ్ బిడ్డలు వున్నట్లు గణాంక వివరాలు పేర్కొంటున్నాయి. అయినా.. పొలిటికల్ పార్టీలు ముదిరాజ్ లకు అన్యాయం చేస్తున్నారు. అధికారం బీఆర్ ఎస్ పార్టీ ముదిరాజ్ లకు మొండి చెయ్యి చూపినట్లు గానే కాంగ్రెస్ – బీజేపీ – టీడీపీ లు ముదిరాజ్ లకు సీట్ల విషయంలో న్యాయం చేస్తారో లేదో అనే సందేహం వ్యక్తం అవుతుంది.
బీజేపీలో ఈటెల రాజేంధర్ ముదిరాజ్,
టీడీపీలో కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ కీలకమైన పదవులలో ఉన్నారు. అయినా.. టిక్కెట్లు ఇచ్చే విషయంలో ఎవరికి వారే చూసు కుంటారా నే ప్రశ్న వెంటాడు తుంది
లేక ముదిరాజ్ జాతీ బిడ్డలకు టిక్కెట్లు ఇస్తారో నిరిక్షించాల్సిం దే.. ?
జాతికి అంకితంగా పని చేసే నాయకత్వం వహించే నిస్వార్తుడు ఒక్కడు పుట్టలేదా.?
ఇలాంటి వివక్షత పై మౌనం ఎందుకో.. తెగించి, త్యాగాలు చేసి పోరాటం చేయడమే అంతిమ విజయంగా సాగే దీరులు జాతికి నాయకత్వామే వహించాలి.
డాక్టర్.బట్టు విఠల్ ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం కామారెడ్డి