ఐఎంఏ మాజీ అధ్యక్షులకు ఘనంగా వీడ్కోలు
– నూతన అధ్యక్షులుగా రాధా రమణ
– ఇందూర్ వార్త కామారెడ్డి అక్టోబర్ 26
కామారెడ్డి ఐఎంఏ మాజీ అధ్యక్షులకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డాక్టర్ అరవింద గౌడ్ మాట్లాడుతూ మాజీ అధ్యక్షులు డాక్టర్ రమణ సేవలు అమోఘమైనవని ఏ చిన్న సమస్య వచ్చినా నేనున్నానంటూ స్పందించి ముందుకు వచ్చి సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేశారని అందుకు ఆయనను అయ్యే తరపు నుండి ఘనంగా సన్మానిస్తున్నాం అన్నారు. అనంతరం ఐఎంఏ లో అధ్యక్షుని పదవీకాలం సంవత్సరం ఉంటుందని, మిగతా సభ్యుల కాలం రెండు సంవత్సరాలు ఉంటుందని రమణ సంవత్సర కాలంగా అధ్యక్షులు కొనసారాని ప్రస్తుతం నూతన అధ్యక్షులుగా డాక్టర్ రాధా రమణను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పవన్, సీనియర్ డాక్టర్లు డాక్టర్ రామలింగం, డాక్టర్ శ్యామ్, డాక్టర్ వెంకట్రాజం, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ కేబీఎన్ రెడ్డి, డాక్టర్ నరేందర్రావు, డాక్టర్ వెంకటేశ్వర గౌడ్, డాక్టర్ పుట్ట మల్లికార్జున్, డాక్టర్ వెంకట్, డాక్టర్ మల్లికార్జున్, డాక్టర్ బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.