ఐఎంఏ గుప్పిట్లో ఆసుపత్రిలు
– కామారెడ్డి లో వైద్యం చేయాలంటే ఐఎంఏ చెప్పినట్లు వినవలసిందే…?
– ఐఎంఏ కనుసనల్లోనే డిఎంహెచ్వో కార్యాలయం?
– పేదలకు సాయం చేసే వారికి ఐఎంఏ అడ్డు వస్తుందని పలువురు వైద్యులు ఆవేదన
– నిబంధనలు పాటించని ప్రైవేటు వైద్యులు
– ఫార్ములా పేరు రాయవలసింది పోయి కంపెనీల పేర్లు రాస్తున్న వైనం
– ఐఎంఏ గుప్పిట్లో ఆసుపత్రిలు?
– ఇంత జరుగుతున్నా చూసి చూడనట్లు నిద్ర మత్తులో అదికారులు
– ప్రైవేట్ దవాఖానలలో నెల నెల మాముల్ల మత్తులో అదికారులు
– మెడికల్ అధికారుల తనిఖీలు శూన్యం
ఇందూర్ వార్త : కామారెడ్డి ,ప్రతినిది
కామారెడ్డి జిల్లాలో ప్రైవేటు వైద్యం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కనుసన్నల్లో నడుస్తుందని పలువురు ప్రైవేట్ వైద్యులే పేర్కొంటున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ ) ను ఎదిరించి కామారెడ్డి జిల్లాలో ఆసుపత్రిని నడిపించుకోలేని పరిస్థితిలో పలువురు వైద్యులు ఉన్నట్లు సమాచారం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏ ఆసుపత్రిలో ఐనా మెడికల్ షాప్ లు వారికి సంబందించిన బందువులది అవుతుండడం గమనార్హం జిల్లా లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ను అదుపులో పెట్టుకున్న ఫార్మసిస్టులు తమ ఇష్టం వచ్చిన మందులను విక్రయిస్తూ డబ్బులు సొమ్ము చేసుకుంటున్నారు. దీన్ని ఆసరా చేసుకున్న డాక్టర్లు సైతం గొలుసు కట్టు రాతలతో ఫార్ములా పేరు రాయకుండా కంపెనీ పేరు రాస్తూ భారీ దోపిడీకి జిల్లాలో తెరలేరు. బయట మార్కెట్లో వంద రూపాయలకు దొరికే ఫార్ములా ఉన్న మందులు, కంపెనీ పేరుతో ఐదు వందల నుంచి వేయి రూపాయల వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఆ రెండు ఆసుపత్రిలు న్యూరా ఆస్పత్రిలే కానీ ఒక ఆసుపత్రిలో రాసిన మందులు మరో ఆసుపత్రిలో దొరకవు దీంతో విదిలేని పరిస్థితిలో రోగులు సైతం ఆ ఫార్మసీ లోనే మందులను కొనుగోలు చేయవలసి వస్తుంది. తద్వారా రోగి తనకు జబ్బు నయమయ్యే వరకు దాదాపుగా ఐదు నుంచి పది వేల రూపాయల వరకు చికిత్స కోసం ఖర్చు చేస్తున్నారు ఆసుపత్రిలో అడ్మిన్ ఐతే చాలు రోగి నుండి డబ్బులు ఎలా కట్టించాలని చూసే డాక్టర్లు ఉన్నారు కానీ రోగికి వైద్యం చేసి జబ్బు నయం అయిందా లేదా అని చూసే డాక్టర్ లుగా తయారు చేస్తున్నా మెడికల్ మాఫీయా…. ఏ కంపెనీ అయినా రూపాయి పెట్టుబడి పెట్టి వంద రూపాయలు రావాలని ఆలోచించే ఈ రోజుల్లో ఫార్ములా కంపెనీలో సైతం అదే బాటను అనుసరిస్తూ అమాయక ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వైద్యం ద్వారా అధిక దోపిడిని చేస్తున్నట్లు సమాచారం. ఏ వైద్యులైన తమ వద్దకు వచ్చే రోగులకు ఫార్ములా పేరు ఇది అని అందరికీ అర్థమయ్యేలా రాయాలని జీవో ఉన్న ఆ జీవ ప్రకారం ఏ వైద్యులు తమ మందుల చీటీని రాయడం లేకుండాపోయింది , మందుల చీటీ పై కంపెనీ పేరు రాస్తున్నారని పలువురు పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు.
తనిఖీలు చేయని డీఎంహెచ్వో..
జిల్లాలో ప్రతి ఆసుపత్రిని జిల్లా వైద్యాధికారి తనికి చేయవలసి ఉంటుంది. జిల్లాలో ఎక్కడ తనికి చేసిన దాఖలాలు కానీ వారు తనిఖీ చేసిన సమయంలో పత్రిక ప్రకటనలు చేసింది కానీ ఎక్కడా లేదు, తప్పని సరి పరిస్థితిలో తనిఖీ చేసిన కూడా ముందస్తుగా యజమానులకు సమాచారం ఇస్తూ లో లోపలనే తనిఖీలు చేస్తూ వారు ఏం తనిఖీ చేస్తున్నారో ఎవరికి తెలియడం లేదు. ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యులు మందుల చీటీ లో రాసిన మందుల పేర్లు ఆసుపత్రి ఆవరణంలో ఉన్న మెడికల్ వారికి తప్ప మరొకరికి తెలియకుండా పోతుంది. తద్వారా రోగులు వారికి కావలసిన మందులు బయట తక్కువ ధరకు దొరికిన అక్కడ కొనుగోలు చేయలేకపోతున్నారు.
చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఐఎంఏ నేనా ?
ప్రైవేట్ ఆస్పత్రిలను డిఎంహెచ్ఓ కార్యాలయం నుండి తనిఖీలు చేయకపోవడానికి ఐఎంఏ నే కారణమా… అని అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఐఎంఏ కనుసనల్లోనే డిఎంహెచ్వో కార్యాలయం నడుస్తుందని జిల్లా ప్రజలు పేర్కొంటున్నారు.
కామారెడ్డి లో కొన్ని ఆసుపత్రిలు ప్రారంభ సమయంలో పలు రాయితీలను ఇస్తూ ఆసుపత్రిలను నెలకొల్పుతున్నారు. వైద్యుల లక్ష్యం పేద ప్రజలకు సేవ చేయాలని ఉన్న ఐఎంఏ నాయకులు వారిని బెదిరిస్తూ డిస్కౌంట్, ఫ్రీగా వైద్యం ఎలా చేస్తారు అని నిలదీస్తున్నట్లు సమాచారం. పేద ప్రజలకు ఎంతో కొంత సేవ చేయాలని ఉన్న వైద్యులు వీరి ఒత్తిడి తట్టుకోలేక ప్రజల నుండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు.
వారు ఉచిత వద్యం చేయరు ? చేసేవారిని చేయనివ్వరు ?
కొందరు డాక్టర్లు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకొని వారి ఆసుపత్రిలకు వచ్చిన రోగుల నుండి ఇష్టం వచ్చినట్లుగా డబ్బులను దండుకుంటున్నారు. ఆ వైద్యుల్లో మానవత్వం ఉన్న కొందరు వైద్యులు తక్కువ ఫీజుతో ఎక్కువ సేవ చేసి తమ ఆసుపత్రికి వచ్చిన రోజులకు ఎంతో కొంత మేలు చేస్తామంటే ఐఎంఏ నాయకులు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఒకానొక సమయంలో వారి ఆసుపత్రుల పైకి అధికారులను పంపించి మూసి వేసే ప్రయత్నం వరకు వెళ్లారని సమాచారం. దీంతో చేసేది లేక మానవత్వం ఉన్న వైద్యులు పేద ప్రజలకు సేవ చేయలేకపోతున్నామని మానసిక వేదనకు గురి అవుతున్నారు. ఇప్పటికైనా డిఎంహెచ్ఓ అధికారులు ప్రతి ఆసుపత్రి పై నిగా ఉంచి ఏ ఆసుపత్రిలో మందుల చీటీలు ఎలా రాస్తున్నారని పరిశీలించి కంపెనీల పేరు వ్రాసే డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు