ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు న్యాయం చేయండి
ఇందూర్ వార్త/ఇల్లందు
ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న గౌడుకులస్తులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కల్పించాలని ఏజెన్సీ గౌడుకుల హక్కుల పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు నరాటి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఇల్లందు మండలం పోలారం లో గౌడుసంఘం మండల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు గా శాసన సభ లో సి ఎం రేవంత్ రెడ్డి గౌడుకులస్తులకు రాజ్యాంగ చట్టం మేరకు ఎస్టీ కుల దృవీకరణ పత్రాలు జారీ చేయాలని. ప్రభుత్వ సంక్షేమ పడకాలు అమలు చేయాలని కోరినప్పటికీ BRS ప్రభుత్వం పట్టించు కొలేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గౌడులకు కుల వృత్తి చేసేందుకు సొసైటీలు ఏర్పాటు చేయాలని. ప్రభుత్వ సంక్షేమ పడాకాలు వర్తింప చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడు కులస్తుల ను ఐక్యం చేసేందుకు. హక్కుల పరిరక్షణ కు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ సభలు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడు కుల హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు ఉమ్మగాని సత్యం. బస్వ వెంకటేశ్వర్లు. బత్హిని రామ్మూర్తి. శ్రీరామ్ కోటయ్య. యాసారపు తిరుపతి. రేసు ఏల్లయ్య బత్తిని సాయన్న రాంమూర్తి పబ్బు శ్రీను సట్ల సంపత్. ముఖ్య సలహా దారులు కొత్త వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు