వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు
వెల్దుర్తి సెప్టెంబర్ 15 ఇందూరు వార్త ప్రతినిధి
మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎల్కపల్లి గ్రామంలో ఆదివారం వినాయక నిమజ్జనం వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలోని భవాని యూత్, ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి ఐదు రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు నిమజ్జనం కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. విద్యుత్ దీపాల అలంకరణతో వినాయకుడికి నృత్యాలు చేసుకుంటూ వీడ్కోలు పలుకుతున్నారు. డిజె సౌండ్ ఏర్పాటు చేసుకొని నృత్యాలు చేస్తూ పెద్ద ఎత్తున యువత ఈ కార్యక్రమంలో , ప్రవీణ్, గణేష్, మధు, మోహన్, సామ్సన్, పవన్, శ్రీకాంత్, మహేష్, శ్రీకాంత్, విజయ్, నరేష్, మధు, నాగరాజు,పాల్గొన్నారు