ఎన్ సీసీ విద్యార్థులకు అండగా నిలిచిన అత్తుఇమామ్
– విద్యార్థులు కోరడంతో పదివేల రూపాయలు విరాళం ఇస్తానని హామీ
– మానవత్వం చాటుకున్నారని విద్యార్థులు సంతోషం
సిద్ధిపేట/ఇందూరు వార్త ఇన్యాలపు హరికృష్ణ ప్రతినిధి జనవరి09:
సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ సీసీ విద్యార్థులకు అండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ అండగా నిలిచారు. సిద్ధిపేట లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ముగ్గుల పోటీలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన ఎన్ సీసీ విద్యార్థులు కూడా పాల్గొని చక్కని ముగ్గులు వేశారు. ఈ సందర్భంగా ఎన్ సీసీ విద్యార్థులకు ఎలాంటి నిధులు ప్రభుత్వం కేటాయిస్తలేదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ దృష్టికి తీసుకువచ్చారు. జనవరి 26న పరేడ్ లో భాగంగా అవసరమైన పరికరాలు కావాల్సిన సామాగ్రి లేనందున పాల్గొన్న లేక పోతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందున నిధులు ఇవ్వాలని కోరడంతో వెంటనే పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ స్పందించి పదివేల రూపాయలు అందిస్తానని హామీని ఇచ్చారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా ఉంటారని అన్నారు. విద్యార్థులకు ఏవైనా సమస్యలు ఉంటే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ దృష్టికి తీసుకువస్తే సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. విద్యార్థులు సమస్యలను పక్కనపెట్టి బాగా చదువుకొని రాణించాలని అన్నారు. త్వరలోనే నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ కూడా మీకు ఆర్థికంగా సహకరిస్తారని అన్నారు. ఎన్ సి సి విద్యార్థులు మాట్లాడుతూ గత ప్రభుత్వం తమను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం తోనే తమ సమస్య పరిష్కారమైందని అన్నారు. గత ప్రభుత్వంలో హామీలు ఇచ్చారు తప్ప ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని అన్నారు. అత్తుఇమామ్ పూజల హరికృష్ణ మానవత్వం చాటుకున్నారని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు