ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ గా మద్దిశెట్టి
ఇందూరు వార్త ఖమ్మం భద్రాద్రి జిల్లా ప్రతి నిధి, జూన్ 29
ఎన్సీపీ పార్టీ అధిష్ఠానం న్యూ ఢిల్లీ కార్యాలయం నుండి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మరియు ఎన్సీపీ పార్టీ అధ్యక్షులు అజిత్ దాదా నుండి ఎన్సీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ మద్దిశెట్టి సామేలు కి చరవాణి ద్వారా త్వరలో జరగనున్న పంచాయితీ, ఎంపీటీసీ మరియు జడ్పిటిసి ఎన్నికలలో పార్టీ తరపున తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ గా నియమిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే నియామక పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ భాద్యతలు నాకు ఇచ్చిన
1. ఎన్సీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మహారాష్ట్ర డిప్యూటీ సిఎం అజిత్ దాదా,కి,
2. పార్లిమెంటరీ ఉమెన్స్ ఎంపవర్మెంట్ కమిటీ సభ్యురాలు, ఎంపీ సునైత్ర పవార్ కి,
3. ఎన్సీపీ పార్టీ యూత్ జాతీయ అధ్యక్షులు ధీరజ్ శర్మకి,
4. ఎన్సీపీ యూత్ నేషనల్ జనరల్ సెక్రటరీ యశ్ పవార్ కి, పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మద్దిశెట్టి సామేలు,
ఎన్సీపీ పార్టీ ఎన్డీఏ కూటమి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జి.