ఉపాధి హామీ డబ్బులు రాక కూలీలు వెలవెల
నెలలు దాటుతున్నయ్డ బ్బులు ఇవ్వండి సార్
_గత_ _సంవత్సరం_ _పెండింగ్_ _డబ్బులు_ _చెల్లించాలని_ _కూలీలు_ _ఆందోళన_
బాసర ఇందూర్ వార్త (రిపోర్టర్ ప్రకాష్ )ఏప్రిల్ 16
నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కీర్గుల్( కె )జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలు వేతనాల కోసం నెల రోజుల నుంచి ఎదురుచూస్తున్నారు. ఎంతో ఎండలు మండుతూ కష్టపడి పొడవు 6 ఫీట్లు అడ్డం ఐదు ఫీట్లు 5 తవ్వుతూ . కూలీ పనులు చేసిన డబ్బులు రాకపోవడం వలన నిరుపేద కుటుంబమునకు తిండి లేక కూలి పనికి పోయి జీవనం సాగించేవారు డబ్బులు పడక ఇబ్బంది పడుతున్నారు గత సంవత్సరం ఒక్కొక్కరికి మూడు వారాలు డబ్బులు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. దీంతో ఎక్కువ మంది కూలీలు ఉపాధి హామీ పథకం పనులపైనే ఆధారపడ్డారు. జనవరి మొదటి వారం నుంచి చెరువులు, ఇతర సాగునీటి వనరుల్లో పూడికతీత పనులు చేస్తుండగా, ఇంతవరకు ఒక్కసారి కూడా కూలి డబ్బులు బ్యాంకు ఖాతాల్లో పడలేదని వాపోతున్నారు.ఉపాధి హామీ పథకం కూలీలకు డబ్బులు సకాలంలో అందకపోవడం వలన వారు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల నుండి కూలీలు చేసిన పనికి డబ్బులు రాలేదు అని, వారి కుటుంబాలు ఆకలితో ఇబ్బందులు పడుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా పనులు కల్పించబడుతున్నప్పటికీ, కూలీల వేతనాలు సకాలంలో అందక, పేద కూలీలు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తుంది. గత సంవత్సరంలో ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు వారాల డబ్బులు ఇప్పటివరకు చెల్లించకపోవడంతో. టి ఏ రాజు. ఫీల్డ్ ఆఫీసర్ . డబ్బుల కోసం ఎదురుచూస్తున్నామని కూలీలు అడుగుతున్నారు. దీనివల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కూడా మందగించాయని.తెలంగాణ సేన పత్రిక. పేర్కొంది.
ఉపాధి హామీ పనుల ద్వారా కూలీలకు గిట్టుబాటు కూలీ రావడం లేదని, వారికి రోజుకు 179 రు మాత్రమే వస్తుందని తెలంగాణ సేన పత్రిక. తెలిపింది. పనులు త్వరగా చేయించినా, కూలీ డబ్బులు సకాలంలో అందకపోవడంతో కూలీలు ఆందోళన చెందుతున్నారు.
ఉపాధి కూలీల వేతనాలు సకాలంలో అందాలని వారు కోరుతున్నారు, మరియు వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు కోరుతున్నారు.