ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా కౌడిపల్లీ మండలంలో ఉన్నటువంటి ‘జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో’ ఆదివారము రోజున ఉచిత కంటి పరీక్షా శిభిరం నిర్వహించారు.ఇందులో భాగంగా నేత్ర వైద్య నిపుణుడు సురేష్ సిబ్బంది సౌజన్య, సైఫ్ అలీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాలనుండి ఉచిత కంటి పరీక్షా శిబిరానికి అధిక సంఖ్యలో జనాలు రావడం జరిగింది.ఈ సందర్భంగా నేత్ర వైద్య నిపుణుడు సురేష్ మాట్లాడుతూ తల నొప్పి, కంటి నొప్పి, కళ్ళు ఎర్రబడటం, చూపు మందగించటం, కంటి నుండి నీరు కారడం మరి ఇతర సమస్యలు ఏవైనా ఉంటే మేడ్చల్ లోని ‘ఆక్సివిజన్ లేజర్ కంటి ఆసుపత్రిని సంప్రదించమని తెలియజేయడం జరిగింది.