ఇందూర్ వార్త ప్రతినిధి రాజు
ప్రయాణికులకు సహకరించిన ఆర్టీసీ డిపార్ట్మెంట్
చీకటిమయంలో ఉన్న బస్టాండ్ వెలుగులలోకి
23 వ తారీకు నాడు ఇందూర్ వార్త లో వచ్చిన కథనానికి స్పందించిన ఆర్టీసీ సిబ్బంది
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గమైన కౌడిపల్లి మండలంలోని బస్టాండ్ లో లైట్స్ రావడంలేదని ప్రయాణికులు వాపోడం తో కౌడిపల్లి మండలం లో రెండు రోజుల లో మెదక్ డిపో ఆర్టీసీ సిఐ వీరబాబు కౌడిపల్లి బస్టాండ్ లో లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని ఆర్టీసీ తరఫునుండి సీఐ వీరబాబు తెలియజేశారు. లైట్లు ఏర్పాటు చేయడంలో సహకరించిన సిబ్బందికి మెదక్ డిపో సిఐ వీరబాబు అభినందనలు తెలియజేశారు. లైట్స్ ఏర్పాటు చేసినందుకు ప్రయాణికులు కృతజ్ఞతలు తెలియజేశారు
*ఈ బస్టాండ్ మనది మన అందరిదీ దీనిని పరిశుభ్రంగా ఉంచుదాం*