ఇంకా పూర్తికాని గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జి
ఇందూర్ వార్త
జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ఫ రవికుమార్ దొర
అశ్వాపురం మండలం.. ఐదు సంవత్సరములకు ఒకసారి ఎమ్మెల్యేలు మారుతున్నారు కానీఆదివాసుల బ్రతుకులు మారటం లేదు.ఎమ్మెల్యేలు ఆస్తులు పెరుగుతున్నాయి కానీ ఆదివాసులకు ఉన్న కొద్ది ఆస్తులు అంతరించిపోతున్నాయి. ఆదివాసి గ్రామాలలో వర్షం వస్తే సరైన రహదారి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు
ఆదివారం నాడు అశ్వాపురం మండలం గొందిగూడెం ఇసుక వాగు బ్రిడ్జిని పరిశీలించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ప రవికుమార్ దొర మాట్లాడుతూ అశ్వపురం మండలంలోని ఆదివాసి గ్రామాలైన గొందిగూడెం, ఎలకలగూడెం ఎగులూరు,గూడెం వర్షాకాలం వస్తే రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. గత ప్రభుత్వం చేపట్టిన ఇసుక ఒక బ్రిడ్జి పూర్తికాకుండ మధ్యలోనే ఆగిపోయింది
ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఆదివాసులకు మేము ఉన్నావ్ అంటూ మాయమాటలు చెప్పి మేము ఆదివాసులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకుని గద్దికేక్కుతున్నారు తప్ప ఆదివాసులకు ఒరిగింది ఏమీ లేదు
దయచేసి ఇకనైనా ఈ ప్రభుత్వమైనా వెంటనే స్పందించి జిల్లా అధికారులతో ప్రజాప్రతినిధులతో మాట్లాడి బ్రిడ్జి నిర్మాణం వెంటనే ప్రారంభించి ఆదివాసి గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జాతీయ ఆదివాసి సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఇర్ప రవికుమార్ దొర