ఆలూర్ మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నం వరకే బంద్.
ఆలూర్ మండల్ ఇందూరు వార్త ప్రతినిధి జి రాజ్ కుమార్
జులై : 9 ఆలూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆలూరు మండల తాసిల్దార్ ఆఫీస్ మధ్యాహ్నము 1:00 కె మూసివేసింది ఉంది అని ప్రజలు తెలిపారు. ఆఫీసు మూసివేసింది చూసి మండల ప్రజలు ఎంతో వ్యయ ప్రయాసలకు కోర్చి ఆఫీస్ కు రాగానే మధ్యాహ్నం వరకే మూసి వేయడంతో ప్రజలు అవాకయ్యారు. రేషన్ కార్డుకు సంబంధించి ధరణి వెబ్సైట్ కు సంబంధించి మరియు వివిధ పని నిమిత్తం ఎమ్మార్వో ఆఫీస్ కు రావడంతో ఏ ఒక్కరు కూడా ఆఫీసులో లేకుండా ఆఫీస్ మొత్తాన్ని మూసివేయడంతో ప్రజలు వెనుతిరిగారు. గతంలో కూడా ఈ మండల తాసిల్దార్ ఆఫీస్ మీద చాలావరకు అభియోగాలు వచ్చాయి ఎమ్మార్వో ప్రజలతో అమర్యాదక మరియు దురుసుగా మాట్లాడడం జరిగిందని ప్రజలు తెలిపారు.
మూసి ఉంచిన ఆలూర్ మండల తహసీల్దార్ కార్యాలయం.