ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ తో మరియు డా. చి నా రాము తో మద్దిశెట్టి.
ఇందూర్ వార్త నవంబర్ 4 కుమ్మరి ఖమ్మం జిల్లా ప్రతినిధి
న్యూ ఢిల్లీ లో ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మాజీ కేంద్రమంత్రి డా.హర్షవర్ధన్ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. త్వరలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ లో జరిగే ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రామురాసిన సంపన్న దళితుల తొక్కిసలాట- పేద దళితుల అనాథ పుస్తక ఆవిష్కరణకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దళిత్ యాక్షన్ కమిటీ జాతీయ అధ్యక్షులు డా. చి నా రాము, తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు పలగాని శ్రీనివాసరావు గౌడ్, జాతీయ యువ మోర్చా అధ్యక్షులు యోగేష్ జాతవ్, నేషనల్ మీడియా అడ్వైజర్ విషు మరియు తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా నుండి తదితరులు పాల్గొన్నారు.