ఇందూర్ వార్త హైదరాబాద్ బ్యూరో, HP, BPCL, IOC కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రిలోపు అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు ధర్నా విరమించారు. HP, BPCL, IOC కంపెనీలలో పెట్రోల్, డీజిల్ నింపుకొని ట్యాంకర్లతో డ్రైవర్లు బయలుదేరారు. కాసేపట్లో పెట్రోల్ బంకులకు ఆయిల్ ట్యాంకర్లు చేరుకోనున్నాయి. రాత్రిలోపు అన్ని బంకులలో యథావిధిగా ఇంధన నిల్వ ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణలో పెట్రోల్‌కు ఎలాంటి సమస్య లేదు. మెటల్ వెకిల్ యాక్ట్ సవరణలో భాగంగా నిరసన తెలిపింది నిజం. కానీ రేపు ఎల్లుండి పెట్రోల్ బంక్ లు బంద్ అంటూ వస్తున్న వార్తలు సరికాదు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అన్ని బంక్ లో పెట్రోల్ అందుబాటులో ఉంది. గాబరపడి ఎక్కువ మొత్తంలో ఎవరు పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయొద్దని మనవి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బంక్ ల్లో పెట్రోల్ లోడ్ అవుతుంది.” అని తెలంగాణ స్టేట్ పెట్రోల్ బంక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి తెలిపారు.
పెట్రోల్ బంకులలో కిలో మీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. బాటిల్స్ నింపుకొని పోతున్నారు. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ దొరకదనే అపోహతో భారీగా క్యూ కట్టారు. వాహన దారులకు పోలీసులు నచ్చజెబుతున్నారు. ఒక్కొక్కరు మూడు, నాలుగు బాటిళ్లతో పెట్రోల్ నింపుకొని వెళుతున్నారు. పెట్రోల్ పోయించుకునే సమయంలో వాహనదారులు వాగ్వాదానికి దిగుతున్నారు. వాహనదారులకు పోలీసులు సర్ది చెపుతున్నారు.