ఆన్నపురెడ్డిపల్లి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో టీచర్లు అందుబాటులో లేరని నిరసన తెలియజేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలిపిన *తుడుం దెబ్బ* నాయకులు
ఇందూరు వార్త ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి డిసెంబర్ 18
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లిలో కస్తూర్బాగాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు విద్యను బోధించే టీచర్లు పదో తారీకు నుండి సమ్మెలో ఉండటం వల్ల విద్యార్థులకు ఎలాంటి క్లాసులు జరగడం లేదు అందువల్ల విద్యార్థులు అందరూ కలిసి పాఠశాల ఆవరణంలో నిరసన వ్యక్తం చేశారు,నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు తుడుం దెబ్బ నాయకులు మద్దతు తెలియజేశారు,వారు మాట్లాడుతూ టీచర్లు చేస్తున్నటువంటి సమ్మెకు ప్రభుత్వం స్పందించాలి,పాఠశాలలో పరీక్షలు టైం టీచర్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థుల చదువులు ఆగమవుతున్నాయని,తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు టీచర్లు అందుబాటులో ఉండేలా చూడలని తుడుం దెబ్బా జిల్లా నాయకులు డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ నాయకులు బండారు సూర్యనారాయణ,తంబళ్ల రవి,కారం నాగేంద్ర బాబు పాల్గొన్నారు.