ఆటో నడిపే వ్యక్తి గుండె పోటుతో మృతి
కామారెడ్డి, మార్చి 6 :
వరుసగా గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనకు గురి చేస్తున్నాయి. కరోనా వచ్చి విలాయతాండం చేయగా మనిషిని మనిషి చూస్తే భయపడే విధంగా మారిన పరిస్థితుల నుండి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న దశలో ఈ హఠాన్ మరణాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. యువకులు గుండెపోటు బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి ఆటో నడువుతుండగా గుండెపోటుకు గురై మృతి చెందిన సంఘటన కామారెడ్డిలో కలకలం రేపింది.
ఓ వ్యక్తి ఆటో నడుపుతూ గుండె పోటుకు గురై మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తిని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన 40 సంవత్సరాల వయసు గల మదార్ గా గుర్తించారు. స్థానికుల కథనం మేరకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మదార్ గత కొంతకాలంగా అయ్యప్ప నగర్ లో గల ఓ వాటర్ ప్లాంట్ లో పని చేస్తున్నాడు. సోమవారం ఆటోలో వాటర్ లోడు చేసుకొని మరో వ్యక్తి ప్రవీణ్ తో వాటర్ క్యాన్లు డెలివరీ చేసేందుకు వెళ్లాడు. జిల్లా కేంద్రంలోని గంజి స్కూల్ ప్రాంతంలో వాటర్ క్యాన్లను డెలివరీ చేశారు. అనంతరం మూత్ర విసర్జన నిమిత్తం మదర్ కిందికి దిగి వెళ్తుండగా అస్వస్థతకు గురై కింద పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే మదార్ కు సిపిఆర్ చేశారు. అనంతరం మదర్ ను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.