ఇందూర్ వార్త (వెబ్ న్యూస్)
హైదరాబాద్ :ప్రతినిధి
హైదరాబాద్ :జులై 21
చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది. 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల ఆనందం అంతా ఇంతా కాదు. సాగు పనులు ఊపందుకోగా, వరినాట్లు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటం.. మరోవైపు రానున్న 5 రోజులు మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వర్ష తీవ్రతపై ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలతో అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల పరిధిలో హెల్ప్లైన్లను ఏర్పాటు చేసింది….