అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వాలి.
ఎంసీపీఐయు పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక కార్యాలయంలో భారత మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఐక్య ఎం సి పి ఐ యు. ఏఐసిటియు కార్మిక సంఘం ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి మాలోత్ జబ్బర్ నాయక్ మాట్లాడుతూ సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా కట్టినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పేద ప్రజలకు పంచాలని అన్నారు .అలాగే ఎవరైతే డబుల్ బెడ్ రూమ్ రాని పేద ప్రజలు ఉన్నారో వాళ్లకు ఎక్కడైతే గవర్నమెంట్ భూమి ఉందో ఆ భూముల్లో ఫ్లాట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఇప్పటికే నిత్యవసరా సరుకులు ఆకాశం అంటున్న సందర్భంలో కొనడానికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు ఇల్లు అద్దె ఎలా కడతారు అని ప్రశ్నించారు అలాగే భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారికి ఇంటి స్థలము ఇచ్చి గృహాలు నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో పార్టీ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తామే పంచుతామని అన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బండారి మైపాల్ కుమ్మరి స్వామి భార్గవి నర్సింలు పద్మ తదితరులు పాల్గొన్నారు.