అదనపు కలెక్టర్ ఉత్తర్వుల్లో స్వల్ప మార్పు
ఖమ్మం జిల్లా :ప్రతినిధి
ఖమ్మం జిల్లా:జులై 25
ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా,ఆదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న నటరాజ్ ను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అదనపు కలెక్టర్ల బదిలీలలో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్న మధుసూదన్ హైదరాబాదు జిల్లా అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు.
కాగా, మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న అదనపు కలెక్టర్ జి.మధుసూదన్ నాయక్ ను ఖమ్మం జిల్లాకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు బదిలీ ఉత్తర్వులతో ఖమ్మం అదనపు కలెక్టర్ మధుసూదన్ ఖమ్మంలో శనివారం రిలీవ్ కాగా, సోమవారం మధుసూదన్ నాయక్ స్థానంలో ఎన్ . నటరాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్వల్ప మార్పులు చేసింది. త్వరలో అదనపు కలెక్టర్ నటరాజ్ బాధ్యతలు చేపట్టనున్నారు…