అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించిన సత్తుపల్లి పట్టణ మండల బీఆర్ఎస్ శ్రేణులు.
సత్తుపల్లి డిసెంబర్ 17 : ఇందూర్ వార్త ప్రతినిధి రవీందర్ రావు
లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అణిచివేత విధానాలకు నిరసనగా రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం బీఆర్ఎస్ సత్తుపల్లి పట్టణ మండల ముఖ్య నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ గారి విగ్రహానికి వినతి పత్రం అందించారు.
ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమ, పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ, మండల నాయకులు, దొడ్డా శంకర్రావు, శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, వీరపనేని బాబి,డీసీసీబీ డైరెక్టర్ మోదుగు పుల్లారావు, కోటగిరి సుధాకర్ ,పట్టణ ప్రధాన కార్యదర్శి మల్లూరి అంకం రాజు, కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ పాషా, గండ్ర రఘు, సూరిబాబు, నరకుళ్ళ శ్రీనివాసరావు, మేకల నరసింహారావు, అబ్దుల్లా, ఆనందరావు, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, మిద్దె శ్రీను, మాధురి మధు, వెదుళ్ళ నాగు, చంటి, బెల్లంకొండ రాము, గాదే సురేష్, మరికంటి శ్రీనివాసరావు, ప్రసాద్, పుచ్చకాయల వెంకటేశ్వరరావు, యాసం రాంబాబు, జొన్నలగడ్డ విజయ్ -కృష్ణ, వీసంపల్లి వెంకటేశ్వరరావు, చింతల సురేందర్ రెడ్డి, తుంబూరు దామోదర్ రెడ్డి, బేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మందపాటి చెన్నారెడ్డి, కొత్తూరు పురుషోత్తమరావు, వినుకొండ వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.