మైనారిటీ రిజర్వేషన్ కొరకు వినతి పత్రం ఇచ్చిన రిజర్వేషన్ సాధన సమితి
బాన్సువాడ పట్టణంలో సోమవారం మైనారిటీ రిజర్వేషన్ సాధన సమితి నాయకుడు అంజత్ ఖాన్ ఆధ్వర్యంలో రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో పాలనాధికారికి మైనారిటీ రిజర్వేషన్ కొరకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సంధర్బంగా మైనారిటీ రిజర్వేషన్ సాధన సమితి నాయకులు అంజత్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీలకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 12% రిజర్వేషన్ ప్రకటించాలని అంజత్ ఖాన్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేకంగా జిఓ విడుదల చేసి మైనారిటీ రిజర్వేషన్ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు జరుగుతున్న అన్ని ఉద్యోగ నియామకాలలో మైనారిటీ రిజర్వేషన్ 12% వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు.