ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
ప్రప్రభుత్వం ఇచ్చిన రైతు వేదిక రైతులకు ఉపయోగకరంగా ఉందా లేదా వాస్తవాల్లోకి వెళితే ఉండాల్సినవి అసలు లేనివి అధికారులు రైతు వేదికలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు
రైతు వేదికను రైతులకు ఉపయోగకరంగా ఉండే విధంగా ఉపయోగించాలి కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతు వేదిక కు తాళాలు వేసి ఉంటున్నాయి
వాస్తవాల్లోకి వెళితే
రైతు వేదికను మొదలు ప్రారంభించింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రైతు వేదిక తొలి భవనాన్ని జనగామ జిల్లా కొడకండ్లలో 31 అక్టోబర్ 2020న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ సీఎస్ సోమేష్ కుమార్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు.
ముఖ్య ఉద్దేశం
రైతు వేదిక రైతులంతా ఒకే చోట చేరి వ్యవసాయం, సాగు చేసే పంటల గురించి చర్చించుకోవడం కోసం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి ఒక్కో క్లస్టర్‌కు ఒక రైతు వేదికను ఒక్కో వేదిక నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.22 లక్షలతో నిర్మించి అందుబాటులోకి తెచ్చారు
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వ్యవసాయరంగంలో మార్పులు తీసుకొచ్చేందుకుగాను నిష్ణాతులైన శాస్త్రవేత్తలతో రైతు వేదికలలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణకు వచ్చే రైతులకు టీ, టిఫిన్లను సైతం అందించాలి
తెలంగాణలో ఉన్న రైతాంగాన్ని సంఘటితం చేసేందుకు ఉపాధిహామీ నిధులతో పాటు వ్యవసాయశాఖ నిధులు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా రూ.573 కోట్లతో 2,604 రైతు వేదికలను నిర్మించారు. ఈ రైతు వేదిక ద్వారా సమావేశాలు, చర్చలు నిర్వహించడంతో పాటు గోడౌన్ గానూ ఈ వేదికలను ఉపయోగిస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాల సాగు విస్తీర్ణాని వ్యవసాయ క్లస్టర్‌గా విభజించి వ్యవసాయ విస్తరణాధికారు (ఏఈఓ) లను నియమించి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా 2604 క్లస్టర్లను ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
ప్రతి రైతు వేదికలో ఏఈఓ, రైతువేదిక కో–ఆర్డినేటర్లకు ఒకటి చొప్పున చాంబర్, 200మంది రైతులు కూర్చునేందుకు వీలుగా సమావేశ మందిరం, రిసెప్షన్, రెండు మరుగుదొడ్లు నిర్మించారు. ఒక్కోవేదిక కోసం కనీసం అర ఎకరం, భూమి లభ్యత ఉన్న చోట ఎకరం ప్రభుత్వం కేటాయించింది. రైతు వేదిక నిర్మాణ బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది.
రైతు వేదికల్లో శిక్షణ ద్వారా రైతులను మరింత సుశిక్షితులను చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. రైతు వేదికల నిర్వహణ, వాటి ద్వారా కర్షకులకు అందుతున్న సేవలపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం, ఒక్కో రైతు వేదిక నిర్వహణకు 2022 ఏప్రిల్ నెల నుండి నెలకు 9 వేల రూపాయల చొప్పున అందజేసేందుకు నిర్ణయించింది. ఈ నిధులతో రైతు వేదికల కరెంట్ బిల్లు, మౌలిక వసతుల కల్పన, మురుగుదొడ్ల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలు కల్పించనున్నారు. గతంలోనే ఈ రైతు వేదికల నిర్వహణ కోసం ప్రతినెలా 3 వేల రూపాయలను ఇవ్వడంతోపాటు రైతుల సమావేశాల నిమిత్తం కుర్చీలు, టేబుళ్ళను అందజేసింది.
నిధుల వినియోగం ఇలా..
రైతు వేదికల నిర్వహణకు మంజూరయ్యే నిధులను ఏ విధంగా వాడుకోవాలో ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక రైతు వేదికకు నెలకు మంజూరయ్యే రూ.9వేలలో విద్యుత్ బిల్లులకు రూ.వెయ్యి, తాగునీటికి రూ.500, స్వీపర్‌కు రూ.3వేలు, స్టేషనరీ, జిరాక్స్ తదితరాలకు రూ.వెయ్యి, రెండు శిక్షణలకు రూ.2500, చిన్న చిన్న రిపేర్లు, శానిటరీ, ఫర్నిచర్, వ్యవసాయ సంబంధ పత్రికల కొనుగోలు తదితర ఖర్చులకు రూ.వెయ్యి వినియోగించుకోవాలి.
మెదక్ జిల్లా వ్యాప్తంగా డేభై ఆరు రైతు వేదికలు ఉన్నాయి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల నిర్వహణ ఖర్చులు శూన్యం. కొన్నిచోట్ల రైతు వేదికల వద్ద నీటి వసతి లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంకొక చోట అన్నీ ఉన్న బాత్రూంలు లేక ఇబ్బంది పడుతున్నారు మరియు నీటి సదుపాయం లేక రైతు వేదికలో ఉండే క్లస్టర్ కూడా ఇబ్బంది పడుతున్నారు. నాణ్యత లేని బాత్రూమ్స్ మరియు టైల్స్, మెదక్ జిల్లాలో కొన్నిచోట్ల రైతు వేదికల వద్ద మందుబాబులకు అడ్డగా మారింది. పట్టించుకునే నాధుడే లేడు ఇకనైనా అధికారులు స్పందించి రైతు వేదిక నిర్వహణ ఖర్చును యధావిధిగా కొనసాగించాలి రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు వేదికను రైతులు తప్పకుండా సద్వినియోగ పరచుకోవాలి
బాత్రూం కి డోర్ లేకపోవడం నీటి సదుపాయం శూన్యం