కొత్తగావిధుల్లోకి వచ్చిన కార్యదర్శుల పరిస్థితి గత మూడేళ్లుగాఆందోళనకరంగా మారింది.
విధుల్లోకెక్కి పనుల్లో పాత బడినప్పటికీఇంకా రెగ్యులరైజ్ కాకపోవడంతో తమ పరిస్థితి ఏంటని అయోమయంలో పడ్డారు. గడువులోపు పనులు
పూర్తి చేయాలని అధికారుల ఒత్తిడితో మరింత మానసికంగా
కుంగిపోతున్నారు. మానసిక ఒత్తిడి భరించలేక రాష్ట్ర వ్యాప్తంగా
సుమారు రెండు వేల మంది కొత్తగా కొలువు సాధించిన గ్రామ
వంచాయితీ కార్యదర్శులు కొన్నాళ్లకే ఈ ఉద్యోగం వదిలి
వెళ్లిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో
మొత్తం 9350 పైచిలుకు కొత్త పంచాయితీ కార్యదర్శులు
విధులు నిర్వర్తిస్తున్నారు. విధుల్లో పని ఒత్తిడి, వివిధ కారణాలతో
ఇప్పటికే జిల్లాలో పదుల సంఖ్యలో కార్యదర్శులు ప్రాణాలు
పోగొట్టుకున్న దాఖలాలు లేకపోలేదు. తాజాగా గత యేడాది
నవంబరులో జిల్లాలోని ఓ పంచాయితీ కార్యదర్శి పని ఒత్తిడి
కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాలపాలయ్యాడు.
దీంతో మున్ముందు తమ పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంటుందనే
ఆందోళన కొత్త కార్యదర్శుల్లో మొదలయ్యింది. ఈ నేపథ్యంలో
తమకు నిర్దిష్ట సమయంలో వని కల్పించేలా చూడాలంటూ
నిరసనలు సైతంచేపడుతున్నారు.
కొత్త పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగంలో చేరినప్పటి
నుంచి నిత్యం పనిభారంతో ముందుకు సాగుతున్నప్పటికీ వారి ఉద్యోగాలకు ఏ మాత్రం గ్యారంటీ లేదనిఅభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. వీరి నియామక సమయంలో తొలత మూడేళ్ల
ప్రొహిబిషన్ పిరియడ్ ఉంటుందని, ఆ తర్వాత పనితీరును బట్టి
రెగ్యులర్ అవుతుందని ప్రభుత్వం సూచించింది. వీరంతా 2019
ఏప్రిల్ 11న అపాయింట్మెంట్ కాగా, అదే నెల 12న విధుల్లో
చేరారు. కానీ మరో సంవత్సరం ప్రొహిబిషన్ ,పీరియడ్ పెంచి ప్రభుత్వం
నాలుగేళ్లకు చేసింది.
కొత్తగా విధుల్లో చేరిన పంచాయతీ కార్యదర్శులు కింది
నుంచి పైవరకు అన్ని రకాల పనులు చేస్తుండటంతో వారు
విసిగెత్తి పోతున్నారు. మొత్తంగా కష్టపడి సంపాదించిన
నౌకరిలో ఇలా వెట్టి చాకిరి చేయాల్సి వస్తోంది అంటూ
కొందరు కార్యదర్శులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరో పక్క నిర్దిష్ట పని
వేళలంటూ లేకుండా పోయాయి. ఉదయం ఏడు గంటలకు
విధులకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నారు. ఇంటికొచ్చిన
తరువాత కూడా అధికారులు ఎక్కడైన దస్త్రం లేదంటే సమాచారంకావాలని ఆదేశాలిస్తే మళ్లీ కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఓటు నమోదు చేయించే బీఎల్ వో బాధ్యతలు కూడా అప్పగించినట్లు చెబుతున్నారు.సర్పంచ్ లతో తప్పని తలనొప్పులు కొత్త గ్రామ కార్యదర్శులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 9350మందికి పైగా కొత్త కార్యదర్శులు విధులు
నిర్వహిస్తున్నారు.వీరంతాఇప్పటికీ తమపరిధిలోలేనటువంటిపునలను నిత్యం చేయాల్సి వస్తోంది. ఒకవైపు ప్రొహిబేషన్ పీరియడ్
పూర్తి కాకపోవడం.. మరోవైపు రెగ్యులర్ కాలేమోనన్న భయంతో
మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. సర్పంచ్ లు తాము చేసిన చేయని పనులకు కూడా బిల్లులు ఇవ్వాలని,అధికార పార్టీనేతలతో ఒత్తిడికి గురి చేయిస్తున్నారని అంటున్నారు.విధులకు వెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నా మెడికల్ బెనిఫిట్స్ లేకపోవడంతో వైద్య ఖర్చులు కూడా వారే భరించాల్సివస్తోంది. కనీస ట్రావెల్స్ అలవెన్స్ కూడా ప్రభుత్వం అందజేయడం
లేదంటున్నారు. ఇదే విషయంపై గత ఏడాది నవంబరు, డిసెంబరు నెలలో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి
దయాకర్ రావును కలిసిన కార్యదర్శులకు మూడు నెలల్లో రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ రెగ్యులర్చేస్తామన్న హామీని అమలు చేస్తారా? లేదా? అంటూ పంచాయతీకార్యదర్శులు ఆశలు ఆవిరైపోయాయని, ప్రభుత్వంపై తిరగబడక తప్పదని ఓ నిర్ణయానికి వచ్చారు. పంచాయతీ కార్యదర్శులు ఏకంగా సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం సకాలంలో సమస్యలు పరిష్కరించకపోవడమే సమ్మె చేయాలని భావనలో పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. మరి ప్రభుత్వం స్పందిస్తుందా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేస్తుందా అవుట్సోర్సింగ్ కార్యదర్శులను ప్రభుత్వ ఉద్యోగులగా గుర్తిస్తుందా.. ఎస్మా ప్రయోగం చేసి ఉద్యోగులను తొలగిస్తుందా చూడాల్సిందే.