బాధిత కుటుంబానికి ఎక్స్ గ్రేషియా అందజేత
ఇందూర్ వార్త
బీర్కూర్ 20 డిసెంబర్
గతంలో ఉపాధి హామీ పని చేస్తూ ప్రమాదశత్తు పాముకాటుకు గురైన దూలిగా లింగమయ్య అనే ఉపాధి కూలీ మరణించడం జరిగింది. ఉపాధి హామీ కూలి చేస్తూ మరణించడంతో అతనికి 2, 00000 రూపాయల ఎక్స్ గ్రేషియా ను అతని భార్య ధూళిగా యాదమ్మకు మాజీ జడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్ అందజేయడం జరిగింది. అలాగే ధూళిగా లింగమయ్యకు ప్రైవేట్ హాస్పిటల్ లో వైద్య ఖర్చులకు అయినా73223 రూపాయల మంజూరు పత్రాలను అందజేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సభ్యులు ద్రోణవల్లి సతీష్, ఎంపీడీవో భాను ప్రకాష్ , ఎమ్మార్వో రాజు, బీర్కూర్ గ్రామ రైతుబంధు అధ్యక్షులు అవారి గంగారం, జడ్పిటిసి స్వరూప, ఎంపిటిసి సందీప్, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లేని బాబురావు, అన్నారం సర్పంచ్ కృష్ణారెడ్డి, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.