ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని విజన్ వృద్ధాశ్రమంలో భరత్ గౌడ్ జన్మదిన వేడుక ఘనంగా నిర్వహించారు.కౌడిపల్లి మండలంలోని రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ కోశాధికారి భరత్ గౌడ్ జన్మదిన, సందర్భంగా నర్సాపూర్ విజన్ వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్ చేసి తాతయ్య, నాన్నమ్మలతో సమానమైన పెద్దలందరికి తన వంతుగా అరటి,యాపిల్,సంత్ర,దానిమ్మ, వంటి ఫలఆహారాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాచంపల్లి సురేందర్ గౌడ్ యోగా శిక్షకులు, అబర్ణ,కీర్తన,రాని,సబితా,సిరివెన్నెల, మరియు వృద్ధాశ్రమ 25 మంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆశ్రమ వృద్దులు మాట్లాడుతూ నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండి.చాలా పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశీర్వదించారు.