దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో ఆగని భూదందా..
ఇందూరు వార్త నవంబర్ 29 ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి
స్వాతంత్ర సమరయోధుని భూములను లాక్కుంటున్న బడా బాబులు..
సహకరిస్తున్న అధికారులు, కలెక్టర్ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.. కేశవ్ గౌడ్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేట, అశ్వరావుపేట మండలాల్లో భూదందా కొనసాగుతూనే ఉంది. కొందరు రాజకీయ నాయకులు, బడా బాబులు ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని అక్రమ పద్ధతిలో పాసుబుక్కులు తయారు చేసుకుంటున్నారు. అదేవిధంగా అశ్వరావుపేట మండలంలోని స్వాతంత్ర సమరయోధునికి చెందిన భూమిని అధికారుల కనుసన్నల్లోనే పాస్ బుక్కులు తయారు చేసుకుంటున్నారు. అధికారులు ముడుపులు తీసుకొని నాయకులకు పనులు చేసే పనిలో నిమగ్నమయ్యారు. నిబంధనలను పక్కనపెట్టి ముడుపులు తీసుకుని ప్రభుత్వ భూమిని అక్రమార్కులకు అంటగడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయా మండలాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
కలెక్టర్ చర్యలు తీసుకోవాలి.. కంటే కేశవ్ గౌడ్..
ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుంటున్న అక్రమార్కులపై కలెక్టర్ ఉక్కు పాదం మోపాలని ఆధార పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చైర్మన్ కంటే కేశవ గౌడ్ విజ్ఞప్తి చేశారు. అధికారుల కనుసన్నలోనే ఈ తతంగం అంతా జరుగుతుందని తెలిపారు. సంబంధిత అధికారులపై కూడా విచారణ చేసి కొరఢా జులిపించాలని కోరారు. అధికార పార్టీ నేతల అండదండలతోనే కొంతమంది పెట్రేగిపోతున్నారని, ఈ విషయాన్ని తక్షణమే అంతమొందించాలని కోరారు. లేని పక్షంలో ప్రభుత్వ భూమి మాయమయ్యే పరిస్థితి నెలకొని ఉందని, ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు.