ఢిల్లీ కేంద్రంగా సీఎం కేసీఆర్ తన జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అయిదు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసింది. బీజేపీ లక్ష్యంగా చేసుకుంటూ ఏర్పాటైన బీఆర్ఎస్ కు ఇతర పార్టీల మద్దతు పైన ఇప్పుడు చర్చ మొదలైంది. బీజేపీ -కాంగ్రెసేతర పార్టీల మద్దతు బీఆర్ఎస్ కు ఖాయమని అంచనా వేసారు. పార్టీ ఏర్పాటు కసరత్తులో భాగంగా సీఎం కేసీఆర్ పలు పార్టీల అధినేత లతో సమావేశాలు నిర్వహించారు. ఆ చర్చల తరువాతే బీఆర్ఎస్ ఏర్పాటైంది. పార్లమెంట్ సమావేశాలు జరగుతున్న సమయంలో ఆ పార్టీల నేతలు ఢిల్లీలోనే ఉన్నారు. కానీ, బీఆర్ఎస్ కార్యాలయానికి దూరం గానే ఉన్నారు. ఏం జరుగుతోంది. జాతీయ స్ఠాయిలో బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచేదెవరు. నాటి మంత్రులు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు.
బీఆర్ఎస్ కార్యాలయంలో ఆ ఇద్దరు నేతలు..
జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏర్పాటు అధికార ప్రక్రియ పూర్తయింది. ఢిల్లీ కేంద్రంగా తాత్కాలిక భవనంలో కార్యాలయం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. శాశ్వత భవనం నిర్మాణంలో ఉంది. కార్యాలయ ప్రారంభోత్సవం ఢిల్లీ కేంద్రంగా సంచలనగా మారుతోందని అంచనా వేసారు. కేసీఆర్ తన జాతీయ పార్టీ ఏర్పాటు క్రమంలో పలువురు పార్టీల నేతల వద్దకు వెళ్లి సమావేశాలు నిర్వహించారు.