ఇందూర్ వార్తా ప్రతినిధి రాజు
కౌడిపల్లి మండలంలో శ్రీ స్వర్గీయ చిలుముల కిషన్ రెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మదన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు సుహాసిన్ రెడ్డి , ఘన నివాళులు అర్పించారు.అదే విధంగా నర్సాపూర్ శాసనసభ్యులు చిలుముల మధన్ రెడ్డి మాట్లాడుతూ “కీర్తి శేషులు”చిలుముల విఠల్ రెడ్డి కుమారుడు అయిన చిలుముల కిషన్ రెడ్డి తను ఎల్లప్పుడూ రాజకీయపరంగా ముందుండి నడిపించిన వ్యక్తి ఆయన ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తు ఉండేవారని. ఇవాళ కిషన్ రెడ్డి మా మధ్య లేకపోవడం మాకు చాలా బాధాకరం అని మధన్ రెడ్డి చెప్పుకొచ్చారు.కిషన్ రెడ్డి వర్దంతి లో భాగంగా. బీ ఆర్ ఎస్ నాయకులు గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ , మెదక్ జిల్లా కోఆప్షన్ మెంబర్ మన్సూర్ , నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్ అశోక్ గౌడ్ , శివ్వంపేట మండలం పి ఎస్ ఎస్ చైర్మన్ వెంకటరామిరెడ్డి , ప్రముఖ సంఘ సేవకులు శివ్వంపేట మండల బీఆర్ఎస్ పార్టీ కోశాధికారి బండారి గంగాధర్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.