ఘనంగా హిందీ దీవాస్ కార్యక్రమం
పాఠశాల హెచ్ ఎం రజాక్
ఇందూరు వార్త గీసుగొండ
ఈ సందర్భంగా గంగదేవిపల్లి ప్రభుత్వ పాఠశాల హెచ్ ఎం రాజక్ గారు మాట్లాడుతూ భారతదేశం లో అధిక సంఖ్యలో మాట్లాడే భాష హిందీ .అనేక రాష్ట్రాలలో హిందీ భాష లోనే మాట్లాడుతారు.పలకడానికి సులభంగా అందరికీ అర్థమయ్యే భాష హిందీ .అక్షర జ్ఞానం లేనివారు కూడా అనర్గళంగా మాట్లాడే భాష హిందీ. పాఠశాలలో 6వ తరగతి నుండి 10 వ తరగతి వరకు హిందీ నేర్పుతారు అని తెలిపారు హిందీ భాష దేనొస్ట్షవం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న జరుపుకుంటారు భారత జాతీయోద్యమం లో అఖిల భారత ఉద్యమాన్ని జాగృతం చేసి ఏక తాటిపై నడిపేందుకు హిందీ భాష ఆనాడు దోహద పడినందున గాంధీజీ స్ఫూర్తితో 1949 లో సెప్టెంబర్ 14 రాజ్యాంగం లోని 351వ అధికరణం 8 వ షెడ్యూల్లో హిందీ నీ కేంద్ర ప్రభుత్వ అధికార భాషగా గుర్తిస్తూ పొందుపరిచారు అని తెలిపారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14 న హిందీ భాష దినోత్సవం జరుపుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు శ్రీనివాసాచారి.స్వరూప.రాణి.రతన్ సింగ్. అనిత.కుమారస్వామి.విద్యార్థులు పాల్గొన్నారు