గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలి
చలో చండ్రుగొండ.
ఇందూరు వార్త నవంబర్ 21 ఖమ్మం జిల్లా ప్రతినిధి
విశ్వ హిందూ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఈ నెల 30 వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ లోని లక్ష్యా గార్డెన్ ఫంక్షన్ హాల్లో గిరిజన శివశక్తుల పూజారుల సమస్యలు పరిష్కరించాలని సభ నిర్వహించడం జరుగుతుంది.
ఈ సభకు విశ్వహిందూ మహాసంఘ్ పీఠం నుండి గురువులు బల్దేవ్ సింగ్ ఠాకూర్* గారు మరియు జాతీయ ఉపాధ్యాక్షురాలు లక్ష్మి ఠాకూర్ మహావీర్ కొరవి, అదే విధంగా కొన్ని రాష్ట్రాల నుండి పీఠాధిపతులు హాజరు కానున్నారు.
కేవలం ఈ సభలో పూజారులకి సంబంధించిన హక్కులు, మౌలిక సదుపాయాలు మరియు వారి సమస్యలు మీద సభ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు సుమారు 2,000. మంది పూజారులు హాజరవుతారు. శాంతియుతంగా జరిగే ఈ సభను విజయవంతం చేయాలని కోరుతున్నాను.
ఈ కార్యక్రమంలో పైదా సోము, కుంజా నాగేంద్రబాబు, సిసింద్రీ, వీర్రాజు, వెంకటేష్, పైదా ప్రసాద్, రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్, బొర్రా నాగమణి, కుంజా భవాని, వాసం రాణి, వట్టం వినోద, ఎండీ రంజాన్, సయ్యద్ ఖమ్రుద్దీన్ ఖాద్రీ తదితరులు పాల్గొన్నారు.
మద్దిశెట్టి సామేలు,
విశ్వ హిందూ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్.