ఐపి పెట్టాను అనడం అవాస్తవం.
-కేవలం గడువుకోసం మాత్రమే నోటీసులు ఇచ్చాను…
-సిద్ధంశెట్టి శ్రీనివాసరావుకు ఈ నోటీసులకు ఎలాంటి సంబంధం లేదు…
-చిదురాల సతీష్…
మంగపేట, ఇందూర్ వార్త ప్రతినిధి (ఉగ్గుమల్ల గణేష్) 24 ఏప్రిల్ 2025:
మంగపేట మండలం కమలాపురంలో గత కొన్ని సంవత్సరాల నుండి నేను కిరాణం షాపు నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించుకొంటున్న క్రమంలో వ్యాపారంలో నష్టం వచ్చి అప్పుల వాళ్లకు ఇచ్చే పైసలకు కొంత గడువు కోసం లాయర్ ద్వారా లీగల్ నోటీసులు మాత్రమే ఇచ్చానని చిదురాల సతీష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా సతీష్ మాట్లాడుతూ గత నాలుగు రోజుల క్రితం సిద్ధంశెట్టి శ్రీనివాసరావు పేరుతో గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలు పంచారు. అందులో సిద్ధంశెట్టి శ్రీనివాసరావు వ్యాపారపరంగా, రాజకీయ పరంగా అతని ఎదుగుదల ఓర్వని కొందరు వ్యక్తులు అతని ద్వారా నేను ఐపి పెట్టానని కరపత్రంలో ముద్రించి ప్రచారం చేస్తున్నారు. నేను ఎలాంటి ఐపి (ఇన్సలవెన్స్ పర్సన్) పెట్టలేదు. నాకు ఎవరు సహకరించలేదు. నాకు కమలాపురంలో 40 లక్షల రూపాయలు విలువ గలా బిల్డింగ్ ఉన్నదని, దానిని అమ్మడంలో కొంత ఆలస్యం అవుతుంది. కనుకనే గడువుకోసం కేవలం లీగల్ నోటీసులు మాత్రమే ఇచ్చాను. దానికి కొంతమంది వ్యక్తులు తెరచాటుగా సిద్ధంశెట్టి శ్రీనివాసరావు పేరును సమాజంలో బదనం చేయడానికి నేను ఐపి పెట్టడానికి శ్రీనివాసరావు ప్రోత్సహించాడని ప్రచారం చేయడం తప్పు అని అన్నారు. నేను ఐపి ఎందుకు పెడతాను. నాకు లక్షల విలువ చేసే ఇల్లు ఉంది. నేను సమాజంలో మళ్ళీ వ్యాపారం చేయాలని చూస్తున్నాను. ఇలా దొంగచాటున పేర్లు పెట్టకుండా దొంగపనులు చేస్తున్నది కరపత్రం పంచిన దొంగలు కదా.? కరపపత్రాలు వేస్తే పేరు పెట్టి వేస్తారు. కాని దొంగలవలే సిద్ధంశెట్టి శ్రీనివాసరావును ఎదుర్కొనలేక దొంగచాటు కుట్రలు పన్నుతున్నారు. దమ్ముంటే ప్రజల మద్యలో వచ్చి తేల్చుకోండి కాని ఇలా నన్ను, శ్రీనివాసరావుని కించపరుచాలని చూడకండని, మీరు చేసేది ప్రజలు అంతా చూస్తున్నారని, నేను అప్పు ఉన్న 18 మందికి ఎనిమిది నెలల గడువు కోరుతూ నోటీసులు ఇచ్చిన లాయర్ సమక్షంలో వారికి ఒప్పంద పత్రం రాసి ఇచ్చాను. కావున ప్రజలు గమనించగలరని కోరారు.